టీమిండియాకు తదుపరి కోచ్ భారతీయుడే అవుతాడని బీసీసీఐ అధికారి తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలా విదేశీ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కాగా అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ తదితరులు కోచ్ రేసులో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండనని ఇప్పటికే చెప్పినట్టు సమాచారం. ఇక ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత… ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండటంతో కొత్త కోచ్ ఎవరు ఏం చర్చ తెరమీదకు వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లలో అనిల్ కుంబ్లే కూడా కోచ్ భాదేతలు స్వీకరించడానికి అంత సముఖత తెలపలేదు అని తెలుస్తుంది. దాంతో లక్ష్మణ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి బీసీసీఐ ఎవరిని నియమిస్తుంది అనేది.