Kejriwal Letter to Modi:త్వరలో సింగపూర్‌లో జరగబోయే ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడం పొరపాటని తెలుపుతూ దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాంటి ఉన్నత వేదికలపై ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. అలా అవకాశం రావడం దేశానికే గర్వకారణమన్నారు. మరి అలాంటి సదస్సుకు తనను వెళ్లకుండా చేయడం ఏమాత్రం సమంజసం కాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Rajasthan: క్రేజీ దొంగలు.. ఎమ్మెల్యే కారునే చోరీ చేశారు.
వాస్తవానికి సింగపూర్‌లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా నిర్వాహకుల నుంచి కేజ్రీవాల్‌కు గతంలోనే ఆహ్వానం లభించింది. దీనికి అధికారికంగా హాజరయ్యేందుకు కేజ్రీవాల్ అనుమతి కోరినా.. ఇప్పటికీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీనిపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రపంచ స్థాయి సదస్సులో ఢిల్లీ మోడల్‌ను ప్రదర్శించేందుకు రావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకుల ఎదుట ఢిల్లీ మోడల్‌ను ప్రదర్శిస్తాం. ఢిల్లీ మోడల్ గురించి మొత్తం ప్రపంచం తెలుసుకోవాలని భావిస్తోంది.. ఇది గొప్ప అవకాశం. వీలైనంత త్వరగా అనుమతి ఇస్తే.. ప్రపంచ వేదికపై మన దేశం ఘనతను చాటేందుకు కృషి చేస్తా” అంటూ అర్వింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సమ్మిట్‌కు వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడం పొరపాటు అని, ఉన్నత స్థాయి సమావేశాలకు వెళ్లకుండా ఓ సీఎంను ఆపడం దేశ ప్రయోజనాలకే విరుద్ధమని స్పష్టం చేశారు