Monkeypox: జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: ప్రపంచాన్ని కరోనా హడలెత్తిస్తున్న వేళ మరో మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
తాజాగా జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తిలో తొలిసారిగా మంకీపాక్స్‌ను నిర్ధారించినట్లు జపాన్ సోమవారం ధృవీకరించిందని టోక్యో గవర్నర్ యురికో కోయికే ప్రకటించారు. ఆ వ్యక్తి యూరప్ నుంచి తిరిగి వచ్చినట్లు గుర్తించారు. జపాన్ ఇది మొదటి మంకీపాక్స్ కేసు అని గవర్నర్ వెల్లడించారు. ఆ వ్యక్తిని టోక్యోలోని ఆసుపత్రిలో చేర్చారని పేర్కొన్నారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అవసరమైన చర్యల గురించి జపాన్ ప్రభుత్వ అధికారులు సమావేశం నిర్వహించిన మరుసటి రోజే మంకీపాక్స్ కేసు నమోదు కావడం గమనార్హం.
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
Commonwealth Games 2022: భారత్‌కు మరో షాక్.. డోప్ టెస్ట్‌లో మరొకరు బుక్
ప్రపంచానికి మంకీపాక్స్‌ను పెనుముప్పుగా డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తోంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా డబ్ల్యూహెచ్ఓ కీలక చర్యలు తీసుకోనుంది. అయితే గత నెలలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌ను ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ నిరాకరించింది.. అయితే గత వారం నుంచి గణనీయంగా కేసుల సంఖ్య పెరగడంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో 16,800లకు పైగా కేసులు నమోదు అయ్యాయి. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు ఏకంగా కేసుల సంఖ్య 77 శాతానికి పెరిగింది. ఇటీవల భారత్‌లో కూడా నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. యూకేలో ప్రారంభం అయిన మంకీపాక్స్ కేసులు క్రమంగా యూరోపియన్ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాల్లో కూడా కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో 11 శాతం కేసులు ఉన్నాయి. ఇటీవల పలు అధ్యయనాల్లో 95 శాతం కేసులు శృంగారం ద్వారానే సంక్రమిస్తుందని తేలింది.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!