Zomato: ఎవరైనా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలనుకుంటారు. ఇంట్లో వంట చేయకపోతే దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ లేదా హోటల్, బేకరీకి వెళ్లి ఏదో ఒకటి తింటారు. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఫుడ్ డెలివరీ చేసుకుని ఆస్వాదిస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం ఆ ప్రాంతంలో డెలివరీ పార్టనర్స్ అందుబాటులో లేకపోవడం, రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన భోజనం అందుబాటులో లేకపోతే ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అందించే సంస్థ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తుంటుంది. ఇలా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అసలే ఆకలితో బాధపడుతుంటే.. ఆర్డర్ చేసి ఫుడ్ క్యాన్సిల్ అయితే అప్పుడు వచ్చే కోపం వేరుగా ఉంటుంది. అలా కస్టమర్ అనుమతి లేకుండా ఆర్డర్ చేసిన ఫుడ్ క్యాన్సిల్ చేసినందుకు జొమాటో సంస్థకు చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్ షాకిచ్చింది. ఆర్డల్ క్యాన్సిల్ చేసినందుకు రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఒకరోజు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఆదేశించింది. 2020లో చండీగఢ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన ఈకేసులో చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా తీర్పు వెలువరించింది.
చండీగఢ్‌కు చెందిన అజయ్‌కుమార్ శర్మకు రాత్రి 10.30 గంటల సమయంలో బాగా ఆకలేసింది. వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో పిజ్జా ఆర్డర్ చేశాడు. ఇన్‌టైంలో ఆర్డర్ చేయడానికి సేవా రుసుము కూడా చెల్లించాడు. అన్ని ట్యాక్స్‌లు కలుపుకుని రూ.287 బిల్లు కాగా.. బుక్ చేసిన కాసేపటికే ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ సందేశం వచ్చింది. వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని తిరిగి అకౌంట్‌లో జమ చేసినట్లు తెలిపింది. సమయానికి ఆర్డర్ ఇవ్వకపోవడంతో పాటు క్యాన్సిల్ చేయడంతో అజయ్‌శర్మకు ఆగ్రహాన్ని తెప్పించింది. తన అనుమతి లేకుండా క్యాన్సిల్ చేయడంతో తొలుత జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేయగా.. ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ అజయ్ శర్మకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
Ananya Panday: నాటీ బాయ్.. అది చేయమంటే దగ్గరకు లాక్కొని బుగ్గ కొరికాడంట
అజయ్‌కుమార్ శర్మ తన పిల్లల కోసం ఆర్డర్ చేశాడని.. రాత్రివేళ ఆర్డర్ క్యాన్సిల్ కావడం వల్ల అతను ఇబ్బందులకు గురయ్యాడని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అభిప్రాయపడింది. ఆర్డల్ క్యాన్సిల్ చేసినందుకు రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఒకరోజు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఆదేశించింది. సమయానికి ఆర్డర్ డెలివరీ చేయలేనప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని సంస్థకు సూచించింది.