ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్యం కార్యదర్శిగా ఉన్న ఎన్ యువరాజ్‌కు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను సర్కారు అప్పగించింది.
ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం తొలి భూ కేటాయింపు చేపట్టింది. ఎంఎస్ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల భూమిని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఉచితంగానే కేటాయించింది
రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్‌లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు.
ఆ ఎమ్మెల్యే అడుసు తొక్కేసి కాలు కడుక్కోవడానికి, కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? పవర్ ఉంది కదా అని రెచ్చిపోయి నోటికి పని చెప్పిన శాసనసభ్యుడికి ఆ పవర్ కట్ చేస్తామంటూ పార్టీ పెద్దల నుంచి వార్నింగ్ వచ్చిందా? ఆయనగారి నోటి దురుసుపై సొంత పార్టీ నేతలు సైతం ఒక్కొక్కరే బయట పడుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బూతు పురాణం?
ఉన్నత విద్యశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్సులో రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు వెనుకబడి ఉండటంపై మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా...రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా... ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?