Complaint to PMO: భర్త తనను వేధిస్తున్నాడని, కొడుతున్నాడని భార్య ఫిర్యాదు చేయడం చాలా సార్లు చూసే ఉంటారు. కానీ ఓ భర్త తన భార్య తనను వేధిస్తుందని వాపోయిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ విషయమై ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి కార్యాలయం, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ తన గోడును వెళ్లగక్కాడు ఆ భార్యా బాధితుడు. స్పందించిన బెంగళూరు సీపీ తనకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనిగా మద్దతు ప్రకటిస్తున్నారు. కొంత మంది అతనిపై జాలి చూపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Ram Gopal Varma: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ తో వర్మ భేటీ.. కారణం అదేనా..?
బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్. అనే ఓ వ్యక్తి తన భార్య తనను వేధిస్తోందని పీఎంవోకు ఫిర్యాదు చేశాడు. ఆమె తనను తరచూ వేధిస్తోందని, తనపై దాడికి పాల్పడుతోందని ట్విటర్ వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఆమెవల్ల తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. భార్య తనను కత్తితో గాయపరిచిందని ఆరోపణలు చేశాడు. “నాకు ఎవరైనా సాయం చేస్తారా? లేదా ఇది జరిగినప్పుడు ఎవరైనా సాయం చేశారా? ఎందుకంటే నేను మగవాడిని! నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. దీనికోసం ఆమెపై హింస కేసు పెట్టొచ్చా? లేదా కదా..” అంటూ యదునందన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. బెంగళూరు సీపీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Would anyone help me? Or did anyone help me when this happened?
No, Because I am a man!
My wife attacked me with knife, Is this the naari shakti you boost about? Can I put a domestic violence case against her for this? No!@PMOIndia @KirenRijiju @NyayPrayaas@CPBlr#MenToo pic.twitter.com/VNqtTQ5kPK— Yadunandan Acharya (@yaadac) October 29, 2022