Delhi: ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన కుటుంబాన్నే అంతమొందించారు. జీతం ఇచ్చిన యజమాని ఫ్యామిలీని మట్టుబెట్టారు. యువతీ యువకుడు పని చేస్తున్న చోటే ప్రేమ వ్యవహారం నడిపించగా.. అది తెలిసిన యజమాని వారిని విధుల్లో నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న వారు కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు. యజమాని దంపతులతో పాటు పనిమనిషి కూడా హత్య చేశారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వెలుగుచూసింది. ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంతోనే పగ పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఇంట్లో నిద్ర పోతున్న పాపను మాత్రం గమనించకపోవడంతో ప్రాణాలతో వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
Complaint to PMO: నారీ శక్తి అంటే ఇదేనా?.. భార్య కొడుతోందంటూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు
ఢిల్లీలోని అశోక్‌నగర్‌లో శాలు అహుజా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లర్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారనే విషయం తెలిశాకే పనిలోంచి తీసేశారు. అంతకు ముందు వారితో ఆమె భర్త సమీర్ అహుజా సైతం ఓసారి గొడవపెట్టుకున్నారు. దీంతో వారిపై ఆ వ్యక్తి పగ పెంచుకున్నాడు. తన ప్రేమికురాలితో పాటు మరో ఇద్దరు స్నేహితులు సచిన్, సుజిత్‌ల హత్యకు పన్నాగం పన్నారు. మరో ఇద్దరి సాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ నమోదైన దృశ్యాల ప్రకారం.. 5గురు రెండు బైకులపై అహుజా ఇంటికి వచ్చారు. శాలూ అహుజా, పని మనిషి స్వప్న మృతదేహాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో లభించగా.. సమీర్ అహుజా మొదటి అంతస్తులో పడి ఉంది. ఆయన ముఖం, తలపై తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారి చిన్నారిని వారు గుర్తించకపోవటం వల్ల చంపలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీ ఉన్నారని తెలిపారు.