మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని... నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే.. గత ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు.
"మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని" రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రెడ్ బుక్ పని ప్రారంభమైంది..తప్పుచేసిన వారిని వదలమన్నారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. తమ విభాగంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముంబయి నటి కాదంబరి జిత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశామని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితి వెల్లడించారు. ఈ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.
రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్‌ఎంఈ డిపార్ట్‌మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 30వ వార్డులోని ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో స్కూల్ వద్ద దుర్బర పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా పాఠశాల ప్రాంగణంలో వర్షపునీరు నిలిచిపోయింది.
రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు.
పవన్‌పై పేర్ని నాని వ్యాఖ్యలపై నిరసనగా పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. పేర్ని నాని దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించి.. జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నంద్యాల జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. తండ్రి బతికుండగానే చనిపోయాడని కుమారుడు లోకేష్ ఆస్తిని అమ్మేశాడు. తండ్రి బ్రతికి ఉన్నాడంటూ తండ్రితో కలసి పెద్ద కుమారుడు రామకృష్ణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.