AP CM Chandrababu: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం
- యువజన సర్వీసులు.. క్రీడల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
- మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం
- స్టేడియంలు..క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి
- అన్ని వర్గాల ప్రజలను క్రీడలు..వ్యాయామం వైపు మళ్లించాలి
- గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని… నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే.. గత ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. నాడు ప్రారంభమై కొంతమేర పూర్తి అయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని….క్రీడలు అంటే కేవలం పోటీల్లో పాల్గొనే వాళ్లకు సంబంధించిన విషయంగానే చూడవద్దని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వాళ్లు కూడా క్రీడల్లో భాగస్వాములు అయ్యేలా చేయాలన్నారు.
గతంలో గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలు ఆడేవారని…ఇప్పుడు టీవీలు, ఇతర మాధ్యమాల కారణంగా ఆ సంస్కృతి పోయిందని సీఎం అన్నారు. మళ్లీ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే….ప్రజలు ఆటల వైపు మొగ్గుచూపుతారని సీఎం అన్నారు. కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ పనులు చేయవచ్చని తెలిపారు. ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలు క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముందుకు వస్తే.. వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తద్వారా ఆయా గ్రామాల్లో క్రీడా వసతులుఏర్పాటు అవుతాయని సీఎం అన్నారు. ఆటల ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుందని….ఐక్యత పెరుగుతుందని.. ఇదొక మంచి సంస్కృతిగా నిలుస్తుందని సీఎం అన్నారు. 2027లో వచ్చే జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలన్నారు.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
Read Also: Minister Nara Lokesh: రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం..
2017లో రూపొందించిన క్రీడా పాలసీ 2022లో ముగిసినా వైసీపీ ప్రభుత్వం కొత్త పాలసీ రూపకల్పనపై చొరవ చూపలేదని, నూతన క్రీడా పాలసీని రూపొందించాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల నిర్మాణంతో పాటు గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వాటిని మళ్లీ నిర్వహణలోకి తీసుకురావాలని ఆదేశించారు. మెడల్స్ సాధనలో రాష్ట్రం వెనుకబడి ఉందని… ఈవిషయంలో ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్‌ను క్రీడా హబ్‌గా మార్చాల్సిన అవసరం ఉందని, ఈ మూడు ప్రాంతాల్లో అన్ని క్రీడల నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన ప్రాజెక్ట్ గాంఢీవ, ప్రాజెక్ట్ పాంచజన్య, ప్రాజెక్ట్ విజయ, డే బోర్డర్స్, స్పోర్ట్స్ నర్సరీస్ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించాలన్నారు. అన్ని స్టేడియాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో క్రీడా అకాడమీల ఏర్పాటుకు స్థలాలు పొందిన వారితో సంప్రదిపుంలు జరిపి వెంటనే వాటి ఏర్పాటు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. వారు ఆసక్తి చూపకపోతే కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలన్నారు.
క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్ర సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చిన్న పాటి స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో విధుల అనంతరం అధికారులు, ఉద్యోగులు కొద్దిసేపు ఆటలు ఆడుకునే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత మేర కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ గ్రౌండ్స్, యూనివర్సిటీ గ్రౌండ్స్, ప్రైవేట విద్యా సంస్ధల గ్రౌండ్స్ ను సామాన్య ప్రజలకు నిర్థేసిత సమయం వరకు అందుబాటులోకి తేవాలన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు వ్యాయామం, ఆటలు ఆడుకునేందుకు అవకాశం కలుగుతుందని సీఎం అన్నారు. ఈ సమీక్షలో మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!