ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్యలు భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో రాముల వారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసుల అధికారులు తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీలో నూతనంగా రానున్న ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని యంత్రాంగాన్ని సిద్దం చేయాలని శుక్రవారం కమీషనరేట్ నుండి నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. వరద సాయం నిమిత్తం రూ.20 కోట్లను రిలయన్స్ కంపెనీ విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు.
తిరుమలకు జగన్ వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్‌కు ఏ సాకులు ఉన్నాయో తెలియదన్నారు. జగన్ తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనన్నారు.
తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ భార్య అయేషా అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష సాయితో యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో యువతి హర్ష సాయితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంది.
ఏపీలో జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో సభ్యులుగా ఆరుగురు అధికారులను నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార శాఖ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో అడ్వాన్స్ టీమ్‌లు నియామకమయ్యాయి.