రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారన్నారు. ప్రసాదం తినేవారిలో అనుమానాలు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారన్నారు. యానిమల్ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దేశంలో ఎక్కడా పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు.
రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో మీడియా వేదిక మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధమని, జీవో విడుదలైందని తెలిపారు.
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఇవాళ విజయవాడ నుంచి తిరుపతికి నేటి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. గతంలో నేటి రాత్రి తిరుమలలో బస చేసి రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు కాలినడకన అలిపిరి మార్గంలో పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లనున్నారు.
గులాబీ తెగులుకు సన్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా? మళ్ళీ వికసించి పాత పరిమళాలు గుభాళించాలంటే.... ఉదయించే సూర్యుడే దిక్కని భావిస్తున్నారా? అందుకే బీఆర్‌ఎస్ అధిష్టానం తమిళనాడు వైపు చూస్తోందా? కేడర్‌కు బూస్ట్ ఇవ్వడానికి, కారుకు సిక్స్‌త్ గేరేయడానికి అదొక్కటే మార్గమని బీఆర్‌ఎస్ పెద్దలు భావిస్తున్నారా? తెలంగాణ భవన్ వర్గాలు అసలెందుకు అన్నా అరివాలయం వైపు చూస్తున్నాయి? అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?
అసలు వాళ్ళకు పదవులు ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్‌కు వెళ్ళాల్నా? అవసరం లేదా? ఆ విషయంలో పీసీసీ అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు గాంధీభవన్ ముఖం చూడ్డం కూడా మానేశారట. పవర్‌లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు? అలా కన్ఫ్యూజ్ అవుతున్న ఆ నాయకులు ఎవరు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టీటీడీ ఆలయ అధికారులు అందజేశారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అందించారు. తిరుమల ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.