Bihar: 4వేల దేవాలయాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. 3నెలల గడువు విధించిన సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. రిజిస్టర్డ్ దేవాలయాలు, మఠాల భూమి ఆక్రమణకు గురికాకుండా నిరోధించడానికి బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నమోదిత దేవాలయాలకు ఫెన్సింగ్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. బీహార్‌లోని అన్ని ప్రభుత్వ దేవాలయాలు,మఠాలు, ట్రస్టులు మరియు ధర్మశాలలు బీహార్ హిందూ రిలీజియస్ ట్రస్టుల చట్టం, 1950 ప్రకారం తప్పనిసరిగా బీఎస్‌బీఆర్టీలో నమోదు చేయబడాలి. అనధికార క్లెయిమ్‌ల నుంచి దేవాలయాల భూమితో సహా ఆస్తులను రక్షించడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
అధికారులు పదేపదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంకా 4000 దేవాలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు రిజిస్టర్ కాలేదు. అవి బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ (BSBRT)లో మూడు నెలల్లోగా నమోదు చేసుకోవాలి. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు తమ తమ జిల్లాల్లో నమోదుకాని సంస్థలన్నీ మూడు నెలల్లోగా రిజిస్టర్ అయ్యేలా చూడాలని తాను అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లకు లేఖ పంపుతున్నానని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ అన్నారు. రిజిస్టర్ కాని దేవాలయాలు, మఠాలు, ట్రస్టులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వస్తుందన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మహిళా సర్పంచ్ భర్త దారుణ హత్య
అవసరమైతే ఎమ్మెల్యే ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్‌లో కొంత భాగాన్ని కొన్ని నమోదిత దేవాలయాలు ట్రస్టుల వద్ద తగినంత డబ్బు లేకపోతే ఫెన్సింగ్ కోసం ఉపయోగించవచ్చని మంత్రి చెప్పారు. ఆ పరిస్థితిలో ఎమ్మెల్యేలు రిజిస్టర్డ్ పబ్లిక్ దేవాలయాలు, ట్రస్టుల జాబితాను ఇవ్వాలన్నారు. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం నమోదిత దేవాలయాల సంఖ్య 3002 కాగా.. వాటికి 18,500 ఎకరాలకు పైగా భూమి ఉంది. 35 జిల్లాల నుంచి అందిన, బీఎస్‌బీఆర్‌టీ సంకలనం చేసిన తాజా డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4055 నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయని.. అవి 4400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నాయన్నారు. జిల్లాల పరిపాలన విభాగం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముజఫర్‌పూర్ (433), సమస్తిపూర్ (272), దర్భంగా (259), తూర్పు చంపారన్ (226), భాగల్‌పూర్ (210), వైశాలి (209)లో అత్యధిక సంఖ్యలో నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయి. సీతామర్హి (203), రోహ్తాష్ (210), భోజ్‌పూర్ (197), బెగుసరాయ్ (170), నలంద (159), సరన్ (154) జిల్లాల్లో నమోదు కానీ దేవాలయాలు ఉన్నాయని బీఎస్‌బీఆర్టీ డేటా పేర్కొంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!