Drugs Mafia: గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తోన్న కేసులో అరెస్టైన కీలక నిందితుడు ఎడ్విన్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. మత్తుమాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టుచేసి 10రోజులు గడవముందే బెయిల్‌పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. 3 నెలల పాటు శ్రమించి గోవా నుంచి ఎడ్విన్‌ను పట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అతనిపై పీడీ చట్టం నమోదుతోపాటు ఆస్తులు జప్తుచేసే పనిలోఉండగానే ఎడ్విన్‌కు బెయిల్ లభించడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతుగా మారింది. అరెస్టయిన రోజుల వ్యవధిలో కేసులో కీలక నిందితుడు బెయిల్‌పై విడుదల కావడం గమనార్హం.
మోస్ట్ వాంటెడ్ అయిన డ్రగ్స్ కింగ్‌పిన్ ఎడ్విన్ న్యూన్స్‌ను ఈ నెల 5న గోవాలో అరెస్ట్ చేశారు. సంవత్సరం నుంచి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు.. ఇప్పటివరకూ కొందరు అంతర్జాతీయ డ్రగ్స్ సప్లయర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఎడ్విన్‌ని అరెస్ట్ చేసేందుకు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించిన అధికారులు.. ఎట్టకేలకు అతడ్ని పట్టుకోగలిగారు. ఎడ్విన్‌పై గోవాలో నాలుగు, హైదరాబాద్‌లో మూడు కేసులు ఉన్నాయి. సోనాలి ఫోగట్ హత్య కేసులోనూ ఎడ్విన్ నిందితుడిగా ఉన్నాడు.
ఎడ్విన్‌కి 45 ఏళ్ల వయసు కాగా.. పది సంవత్సరాల నుంచి అతడు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. తొలుత గోవాలో ఒక రెస్టారెంట్‌లో వర్కర్‌గా పని చేసిన ఎడ్విన్.. ఆ తర్వాత డ్రగ్స్ నెట్‌వర్క్‌లో కీలకంగా మారాడు. క్రమంగా డ్రగ్స్ కింగ్‌పిన్‌గా అవతరించాడు. ఇతనికి 50 వేల మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అందులో 600 మంది తెలంగాణకు చెందిన కస్టమర్స్ ఉన్నట్టు తేలింది. డ్రగ్స్ ద్వారా వందల కోట్లు డబ్బు సంపాదించిన ఇతను.. గోవాలో మూడు వీలాసవంతమైన ఇళ్లను నిర్మించుకున్నాడు. గోవాలో ఎడ్విన్ చెప్పిందే వేదం. గోవాలో అడుగుపెట్టారంటే.. కస్టమర్స్ అందరూ అతనికి చెందిన కర్లిస్ షాక్‌కు వెళ్లాల్సిందే! ముంబైకి చెందిన ఓ వ్యాపారి కుమార్తెను పెళ్లి చేసుకున్న ఇతగాడు.. గోవాలో పెద్ద మ్యూజిక్ పార్టీలను ఏర్పాటు చేసి, డ్రగ్స్‌ని విక్రయించేవాడు.
Barytes Mines in Mangampet: మంగంపేటలో టెన్షన్ టెన్షన్.. బ్లాస్టింగ్ తో బాలుడు మృతి
గోవా ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌కు కొకైన్, హెరాయిన్, ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ వంటి మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎడ్విన్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ తరుణంలో మత్తు దందాలో కీలకంగా ఉంటున్న ఎడ్విన్ పేరు వెలుగులోకి వచ్చింది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కలకలం రేపిన గోవా కర్లీస్ షాక్ రెస్టారెంట్‌లో, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భాజపా నాయకురాలు సోనాలీ పొగాట్ మృతికేసులో నిందితుడిగా ఉన్న ఎడ్విన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులకు దొరకకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు.
ఆ ఘరానా మత్తుమాఫియా నాయకుడిని పట్టుకునేందుకు, పోలీసులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఈనెల 5న గోవా నుంచి పట్టుకొచ్చారు. అలాంటి వ్యక్తి బెయిల్ పొంది తప్పించుకోవడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఎడ్విన్‌పై ఎన్‌డీపీఎస్ చట్టం కింద హైదరాబాద్ రాంగోపాల్‌పేట్, ఉస్మానియా యూనివర్శిటీ, లాలాగూడ పోలీస్‌స్టేషన్లలో కేసులునమోదయ్యాయి. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైనా బెయిల్ ఎలా లభించిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.