Solar and Lunar Eclipses: 15 రోజుల్లోనే సూర్య, చంద్ర గ్రహణాలు.. ఇది ప్రమాదకరమా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar and Lunar Eclipses: 2026లో కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండు గ్రహణాలు చూడబోతున్నాం.. ఫిబ్రవరి మరియు మార్చి మధ్యలో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. భారత్‌లో కనిపించకపోయినా.. ఫిబ్రవరి 17 అంటే ఈ రోజు సూర్యగ్రహణం ఏర్పడగా.. చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడనుంది.. జ్యోతిషశాస్త్ర ప్రకారం, సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం మధ్య 15 రోజుల కాలం అశుభకరమైనది. ఈ సమయంలో అగ్ని పంచకం కూడా ఉండటం వల్ల వ్యక్తిగత, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు..
గ్రహణాల జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రభావం
పురాతన నమ్మకాల ప్రకారం, సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణాలు రాహు-కేతు ప్రభావంతో సంభవిస్తాయి. సూర్యగ్రహణం విషయానికి వస్తే.. సూర్యుడు శక్తి, నాయకత్వం, ఆత్మవిశ్వాసానికి సూచిక. సూర్యగ్రహణం ప్రధాన నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ మార్పులు వంటి అంశాలకు ప్రభావం చూపవచ్చని జ్యోతిష శాస్త్రంలో విశ్లేషించబడింది. ఇక, చంద్రగ్రహణం అయితే.. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు ప్రతీక. ఈ సమయంలో కోపం, ఒత్తిడి, మానసిక అస్థిరతలు, పుకార్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
Also Read
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం.!
- Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
- Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
- Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
అగ్ని పంచకం: ఏమిటి, ఎందుకు జాగ్రత్తలు అవసరం?
అగ్ని పంచకం అంటే సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం మధ్య సంభవించే ఐదు రోజుల కాలాన్ని సూచిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ సమయంలో.. అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాల కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.. అంతేకాదు.. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, అస్థిరతలు కనిపించవచ్చు. అనవసర వివాదాలు, కోపంతో తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు రాహు ప్రభావంతో తప్పుదారి పట్టే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* వివాదాలు నివారించండి: కోపంతో ఏ నిర్ణయాలను తీసుకోవద్దు. సమస్యలు తక్షణమే పరిష్కరించలేకపోతే, జాగ్రత్తగా ఎదుర్కోవాలి.
* ఆరోగ్య పట్ల శ్రద్ధ: వేడి, చల్లని వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు రావచ్చని గమనించాలి. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళండి.
* ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా: ఈ కాలంలో పెద్ద డబ్బు వ్యవహారాలు, పెట్టుబడులు వాయిదా పెట్టడం మంచిది.
* హోలాష్టకం జాగ్రత్తలు: అగ్ని పంచకం ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే హోలాష్టకం కూడా జాగ్రత్త అవసరమని సూచించబడింది.
గ్రహణాల తేదీలు
* ఫిబ్రవరి 17, 2026: సూర్యగ్రహణం (భారతదేశంలో కనిపించలేదు.. ఆఫ్రికన్ దేశాల్లో కనిపిస్తోంది..)
* మార్చి 3, 2026: చంద్రగ్రహణం (భారతదేశంలో కనిపిస్తుంది; హోలిక దహన్ రోజుతో అనుసంధానం)
వ్యక్తిగత మరియు సామాజిక ప్రభావాలు
జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించడం రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులలో అస్థిరత, ఒత్తిడి మరియు సంఘర్షణలకు సంకేతం. 2026లో రాహు-కుజ కలయిక (అంగారక యోగం) కూడా వ్యక్తిగత మరియు సామాజిక పరిణామాలను ప్రభావితం చేయవచ్చు.
తాజావార్తలు
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్‌కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
-
Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
-
Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
-
CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
-
Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!