Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరో 5 రోజులు పొడిగించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Koregaon-Bhima Violence Case: జైలు నుంచి ఉద్యమకారుడు గౌతమ్ నవ్‌లఖా విడుదల.. గృహ నిర్బంధం
ఇదిలా ఉండగా.. నిందితుడు విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించావించింది. ప్రభుత్వంలోని పెద్దలకు రూ.100 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు, పాలసీ తయారీలో విజయ్‌నాయర్ కీలక పాత్ర పోషించారని, అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్‌నాయర్‌లు కలిసి లంచాలు ఇచ్చారని ఈడీ చెప్పింది. హోల్‌సేలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని.. ప్రభుత్వంలోని పెద్దలకు రూ.30 కోట్ల వరకు చెల్లించారని వెల్లడించింది. విజయ్‌నాయర్ తనకు తాను ఢిల్లీ ఎక్సైజ్ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడని పేర్కొంది ఎక్సైజ్ పాలసీని తమ వారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని, 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతుల్లోకి వచ్చినట్లు పేర్కొంది.