జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు. వేదికపై ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు 42 మంది గల్లంతైనట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అక్కడి కీలక అధికారులతో ఆయన భేటీలో రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణం తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరూట్‌లోని నివాస ప్రాంతాలపై కూడా దాడి చేస్తోంది. తొలిసారిగా బీరుట్‌లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. బీరుట్ శివారు ప్రాంతాలే కాకుండా, ఆదివారం సాయంత్రం నుంచి బీరుట్‌లో కూడా ఇజ్రాయెలీ డ్రోన్‌లు కనిపించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించాల్సిన ఆర్థిక ప్రగతి, కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మాస్టర్ కార్డు కేంద్రం ద్వారా సాధిస్తున్న ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై ఆయా రంగ ప్రముఖులతో శుక్రవారం ప్రధానంగా చర్చించారు.
రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పండుగ వేళ చేనేత దుస్తులు ధరించుదాం... నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేత కార్మికులు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దాం అని సూచించారు.
అది పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు. కానీ... తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో ఉందట. ఎప్పుడో వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే సీటు కోసం ఇప్పట్నుంచే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ కసరత్తు మొదలు పెట్టాయంటేనే దాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఏదా ఎమ్మెల్సీ?
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కబోతున్నాయా? రాష్ట్రంలోని అసంతృప్క నేతలందర్నీ బుజ్జగించే ప్రోగ్రామ్ మొదలైందా? ఏఐసీసీ లిస్ట్‌లో ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరెవరు? వాళ్ళకు దక్కబోయే పదవులేంటి?
అక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీగా యుద్ధం నడుస్తోందా? పార్టీ సీనియర్ లీడర్ ఏకంగా మంత్రి మీదే ఎర్రచందనం, మట్టి మాఫియా ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వ కార్యక్రమం వేదికగా రోజుకో నాయకుడి మీద పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? ఎక్కడ జరుగుతోందా తన్నులాట?