Viral Video: బీజేపీ బహిష్కృత నేత హోటల్ కూల్చివేత.. ఏకంగా 60 డైనమైట్లతో.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Hotel Razed Video Goes Viral: మధ్యప్రదేశ్‌లో జగదీష్ యాదవ్ హత్య కేసుపై ప్రజల ఆగ్రహావేశాలతో సాగర్‌లోని సస్పెండ్ అయిన బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోటల్‌ను కూల్చివేశారు. మిశ్రీ చంద్ గుప్తా అక్రమ హోటల్‌ను జిల్లా యంత్రాంగం మంగళవారం ధ్వంసం చేసింది. డిసెంబరు 22న జగదీష్ యాదవ్‌పై తన ఎస్‌యూవీతో గుద్ది హత్య చేసినట్లు బీజేపీ నేతపై ఆరోపణలు వచ్చాయి.ఇండోర్‌కు చెందిన ప్రత్యేక బృందం మంగళవారం సాయంత్రం హోటల్‌ను కూల్చివేసేందుకు 60 డైనమైట్‌లను పేల్చింది. క్షణాల్లో భవనం కుప్పకూలి శిథిలావస్థకు చేరుకుంది. ఈ హత్య కేసులో పోలీసులు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు.
ఇండోర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ జైరామ్ ప్యాలెస్‌ని సుమారు 60 డైనమైట్‌లను ఉపయోగించి ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో సెకండ్ల వ్యవధిలో నెటమట్టం అయ్యింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సాగర్‌జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. మిశ్రీ చంద్ గుప్తా హోటల్ జైరామ్ ప్యాలెస్ సాగర్‌లోని మకరోనియా కూడలికి సమీపంలో ఉంది. హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివసించే వారిని కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. భవనాన్ని మాత్రమే కూల్చివేశామని జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.
Also Read
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
Chennai Techie: రోడ్డుపై గుంతను తప్పించుకునే ప్రయత్నంలో.. ట్రక్కును ఢీకొట్టి..
డిసెంబరు 22న కోరేగావ్‌లో నివాసం ఉంటున్న జగదీష్ యాదవ్ అనే వ్యక్తిని ఎస్‌యూవీ వాహనంతో గుద్ది హత్య చేసినట్లు చంద్ర గుప్తాపై ఆరోపణలు వచ్చాయి. జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. ప్రజాసంఘాల ఎన్నికల్లో కిరణ్ యాదవ్ మిశ్రీ చంద్ గుప్తా భార్య మీనాపై 83 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఈ విద్వేషంతోనే జగదీష్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను మాక్రోనియాలోని కోరేగావ్ నివాసి. మాక్రోనియా కూడలిలో ఉన్న ఒక డైరీ ఫామ్‌లో పనిచేశాడు.
#WATCH | MP | Police razed illegal hotel of suspended BJP leader Mishri Chand Gupta after public protest over Jagdish Yadav murder case in Sagar
"There has been no loss of any kind. Only the building was demolished," said Collector Deepak Arya (03.01) pic.twitter.com/VsAbVhRGi8
— ANI (@ANI) January 4, 2023
తాజావార్తలు
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
-
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!