మహారాష్ట్రలోని పుణె జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన పైలట్, ఇద్దరు ఇంజనీర్లు మృతి చెందారు. పుణె జిల్లాలో బుధవారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడింటారు.
పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారతదేశం ఒక అడ్వైజరీ జారీ చేసింది.
పంజాబ్‌లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురుదాస్‌పూర్‌లోని హర్దోవల్ కలాన్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం రూ. 50 లక్షలకు వేలం ప్రారంభం కాగా, స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మా సింగ్ రూ. 2 కోట్లకు వేలంలో సర్పంచ్ సీటును సొంతం చేసుకున్నాడు.
ఈ రోజు దేశం మొత్తం మహాత్మ గాంధీ జయంతిని జరుపుకుంటోంది. మన భారతీయ కరెన్సీ పై గాంధీ ఫొటోస్ ఉండటం చూస్తున్నాం.. కానీ ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉండగా, ఆయన ఫోటోలను పెట్టడానికి అసలు కారణాలు చాలామందికి తెలియదు.. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఆ స్టోరీ ఏంటో ఈరోజు గాంధీ జయంతి సందర్బంగా వివరంగా తెలుసుకుందాం.
లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, ఎలాంటి ప్రతీకార చర్యలనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది.
మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసి నరకం నుంచి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి అంటూ మంత్రి తెలిపారు.
నేటి నుండి హైదరాబాద్‌లో డీజే పై నిషేధం విధించారు. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాదులో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ బాధితులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారన్నారు.
తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టులో సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశానన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
మల్లన్నసాగర్ వర్సెస్ మూసీగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీపై బీఆర్‌ఎస్, మల్లన్నసాగర్ పై కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. గజ్వేల్‌లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీఆర్‌ఎస్ సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తామెక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించలేదని.. మీలాగా బాధితులపై లాఠీలతో కొట్టించలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మల్లన్నసాగర్ బాధితుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ నేతలు…