Rob Own Son: సొంత కొడుకునే దోచుకునేందుకు మెడపై కత్తిపెట్టాడు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rob Own Son: ఓ వ్యక్తి కన్న కొడుకునే దోచుకునేందుకు మెడపై కత్తిపె ప్రయత్నించాడు. కానీ విచిత్రమేంటంటే తాను దోచుకుంటోంది తన కన్న కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. గత ఏడాది నవంబర్‌లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 45 ఏళ్ల వ్యక్తి తన టీనేజ్ కుమారుడిని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేరం కింద సదరు తండ్రికి న్యాయస్థానం 26 నెలల జైలు శిక్ష విధించింది.
అసలు జరిగిందేమిటంటే.. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నివసిస్తున్న 17 ఏళ్ల టీనేజర్ ఓ రోజు తన ఇంటి దగ్గరలోని ఏటీఎంలో డబ్బుల కోసం వెళ్లాడు. ఆ టీనేజర్ ఏటీఎం నుంచి 10 పౌండ్లు (రూ. 986) తీసుకున్నాడు. అతను డబ్బులు తీసుకుని కార్డుని జేబులో పెట్టుకుంటుండగా.. ఎవరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి యువకుడిని గోడకు బలంగా నెట్టేశారు. పైగా యువకుడిని గోడకు నొక్కేస్తూ వెనక్కు తిరగనివ్వకుండా మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. ఆ టీనేజర్ భయంతో ఏం కావాలని ఆ ఆగంతుకుడిని అడగగా.. ఆ తర్వాత ముసుగు వేసుకున్న వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆ ఆగంతకుడి గొంతు విని తన తండ్రి అని గుర్తించి యువకుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నిదానించుకుని నేనెవరో తెలుసా అని గట్టిగా అడుగుతాడు యువకుడు. నిజంగానే నన్ను డబ్బులు అడుగుతున్నావా అని కూడా ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తిని. ఐతే ఆగంతకుడు అదేమి పట్టనంటూ ఔను! అంటూ డబ్బులిస్తావా లేదా అని డిమాండ్ చేస్తూనే ఉంటాడు. దీంతో ఆ యువకుడు వెంటనే వెనక్కు తిరిగి అతని ముసుగు ఒక్కసారిగా లాగేసి..ఏంటిదా నాన్న! అని ఆగంతకుడి రూపంలో ఉన్న తండ్రిని గట్టిగా నిలదీశాడు.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
Read Also: Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
తండ్రి ఒక్కసారిగా బిత్తరపోయి చూశాడు. కొడుకు వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోలీసులకు సమాచారం అందించగా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తర్వాత దొంగను అరెస్టు చేయగా, తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.ఈ మేరకు కోర్టులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడమే కాకుండా ఏటీఎం వద్ధ ఉన్నది తన కొడుకని తెలియదని చెప్పాడు. దీంతో న్యాయస్థానం అసాధారణమైన సంఘటనగా పేర్కొంటూ నిందితుడికి 26 నెలల జైలు శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!