Viral Video: బహిరంగ ర్యాలీలో మహిళా నాయకురాలిని ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నాయకురాలిని ముద్దుపెట్టుకోవడం వివాదాస్పదమైంది. శివసేన నాయకురాలు శీతల్ మ్హత్రేను సర్వే ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే షీతల్ నిలబడి ఉన్నారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే రెండుసార్లు కిందకు వంగి మహిళా నేతను ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియో ద్వారా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
https://twitter.com/foundat11/status/1634739932878245889?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1634739932878245889%7Ctwgr%5E079d02622861d624ca56efb1130ed1ec44500990%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fnational%2Ffact-check-video-shiv-sena-mla-prakash-surve-kissing-woman-leader-1545551
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నకిలీదని తేల్చారు. ఇద్దరు శివసేన నాయకుల ముద్దుల వైరల్ వీడియో నకిలీదని, ఎమ్మెల్యే పరువు తీసేందుకు, అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియో మార్ఫింగ్ చేయబడిందని సర్వే కుటుంబం ఆరోపించింది. ఈ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సర్వే కుటుంబం ద్వారా కేసు కూడా నమోదు చేయబడింది. ఇద్దరు శివసేన నేతలు కెమెరాలో ముద్దుపెట్టుకుంటున్న వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 354,509,500,34, 67 కింద దహిసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులు 26 ఏళ్ల మానస్ కువార్, 45 ఏళ్ల అశోక్ మిశ్రాను అరెస్టు చేశారు.
Read Also: Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
అంతే కాకుండా ఈ వీడియో వ్యవహారంపై శివసేన అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు బాధ్యులైన వ్యక్తులపై విరుచుకుపడ్డారు. ఆమె వ్యక్తిత్వాన్ని అవమానించారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో “రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా? ఇదేనా మీ సంస్కృతి? మాతోశ్రీ అనే ఫేస్‌బుక్ పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన వీడియోని అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
राजकारणामधील महिलेसंदर्भात बोलण्यासारखे काही नसले तर तिचे चारित्र्यहनन करणे हेच उद्ध्वस्त गटाचे संस्कार आहेत?? मातोश्री नावाच्या fb पेजवरुन एका स्त्री संदर्भात असा morphed video upload करताना बाळासाहेबांचे संस्कार नाही का आठवले? pic.twitter.com/rpaqbMtiZU
— sheetal mhatre (@sheetalmhatre1) March 11, 2023
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!