తిరుపతి చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి కారుపై పెట్రోల్ పోసి కారులో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజును దుండగులు తగలబెట్టారు.
పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ శుక్రవారం పుదుచ్చేరి అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)కి రాష్ట్ర హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇది 14వసారి.
వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పటికే అత్యుత్తమ జ్యూవెలరీగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు ఇటీవలే నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే.
కర్ణాటక రాజధాని బెంగళూరులో విచిత్రమైన కేసు నమోదైంది. ఓ మహిళ తన భర్త లిప్‌స్టిక్ రాసుకుని, మహిళలు ధరించే లోదుస్తులు వేసుకుంటాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇండిగో 6ఈ-1052 బ్యాంకాక్-ముంబై విమానంలో సిబ్బందిని వేధించినందుకు స్వీడిష్ జాతీయుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తిని క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్(62)గా గుర్తించారు.
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తనకు మొబైల్ టెక్ట్స్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు.
హిందువులపై దాడుల్ని ఖండిస్తూ అమెరికాలోని జార్జియా అసెంబ్లీ తీర్మానం చేసింది. హిందూఫోబియాను ఖండిస్తూ చేసిన ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న మొదటి అమెరికన్ రాష్ట్రంగా నిలిచింది.