ఏడు దశాబ్దాలకు పైగా స్వాతంత్య్రం పొందిన తరువాత పాకిస్తాన్‌లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విభజన పొరపాటుగా జరిగిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం అన్నారు.
గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛను డబ్బుల కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఒకట్రెండు రోజులు కాదండోయ్.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా నాటకమాడి అధికారులను బోల్తా కొట్టించింది.
ప్రాణాలతో బయటపడిన మాజీ విద్యార్థిని లైంగిక వేధింపుల ఫిర్యాదుపై అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిపద్మన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. చెన్నైలోని సాంప్రదాయ కళలను బోధించే, శాస్త్రీయ కళలకు సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థ కళాక్షేత్ర ఫౌండేషన్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఏప్రిల్ 9న 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' జరగనుంది.ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటకలో పర్యటించనున్న రోజున రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించనున్నారు.
ప్రస్తుతం టెక్ వర్గాల్లో చాట్‌జీపీటీ ఒక సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీని వాడకంలోని నైతికతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు.
అనుమానం పెను భూతమైంది.. అని చాలా సార్లు చదివే ఉంటాం. ఈ సంఘటనలోనూ ఆ అనుమానమే.. ఏడాదైనా నిండని పసి కందు పాలిట యమ పాశమైంది. భార్యపై పెంచుకున్న అనుమానమే... ఆ బాలుడి ఉసురు తీసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నూతన విదేశాంగ విధాన సిద్ధాంతాన్ని శుక్రవారం ఆమోదించారు. ఆ విధానం ప్రకారం రష్యా యురేషియాలో భారతదేశంతో తన వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లక్షణాల విషయంలో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మేదాంత హాస్పిటల్ వైద్యులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ ఛైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ సూచించారు.
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ జరుగుతుండగానే వైసీపీ, టీడీపీకి చెందిన ఇరుపార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం కాస్తా మరింత ముదిరి సభలోనే వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని తన నివాసంలో వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మర్రిపాడు నుంచి చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరారు.అక్కడి నుంచి చెన్నైకి తరలించే అవకాశం ఉంది.