తూర్పు ఉక్రెయిన్ నగరమైన స్లోవియన్స్క్‌లోని నివాస ప్రాంతంపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసినట్లు అల్ జజీరా నివేదించింది. ఈ దాడిలో 8 మంది మరణించినట్లు తెలిపింది. రష్యాకు చెందిన ఏడు ఎస్-300 క్షిపణులు బఖ్‌ముట్ నగరానికి పశ్చిమాన ఉన్న స్లోవియన్స్క్‌పై దాడి చేశాయి.
ఢిల్లీలోని ద్వారకా జిల్లాలోని బిందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటియాలా రోడ్‌లో తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం స్థానిక బీజేపీ నాయకుడు సురేంద్ర మతియాలాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్ ఆలయ యాత్ర జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మోడ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గురువారం ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అతిక్ అహ్మద్ తన 19 ఏళ్ల కుమారుడి పెళ్లిని తన సోదరి కుమార్తెతో నిర్ణయించినట్లు తెలిసింది.
పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా శుక్రవారం బీర్భూమ్ చేరుకున్నారు. బెంగాల్‌లో బీర్భూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో టీఎంసీ సర్కారు విమర్శనాస్త్రాలు సంధించారు.
దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అక్కర్లేదని దేశంలోని కొందరు ‘దేశ వ్యతిరేకులు’ మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు.
నర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్‌సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు.
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ జెస్సికా జోనాసెన్ తన చిరకాల ప్రేయసి సారా వేర్న్‌ను వివాహం చేసుకుంది. పదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ ప్రేమికుల జంట ఏప్రిల్ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.