దేశంలో గత 24 గంటల్లో 10,093 కొవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది శనివారం నాడు నమోదైన 10,747 కేసుల సంఖ్య కంటే 6 శాతం తక్కువ. గత రెండు వారాల్లో ఇటీవలి ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలలో దేశంలో 10,000 కేసులు నమోదవడం ఇది వరుసగా నాలుగో రోజు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు.
సూడాన్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లింది. అక్కడ ఆర్మీ, పారా మిలిటరీ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు బలగాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. సుడాన్ రాజధాని ఖార్టూమ్ కాల్పు ల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. ఆదివారం తెల్లవారుజామున సూడాన్ రాజధానిలో పోరాటం ఉద్ధృతంగా సాగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు.