Jessica Jonassen: ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jessica Jonassen: ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ జెస్సికా జోనాసెన్ తన చిరకాల ప్రేయసి సారా వేర్న్‌ను వివాహం చేసుకుంది. పదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ ప్రేమికుల జంట ఏప్రిల్ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది. హవాయిలో అత్యంత సన్నిహితుల నడుమ జెస్సికా జోనాసెన్- సారా వేర్న్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ మేరకు జోనాసెన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
సారా – జోనాసెన్‌లు చాలాకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2018లో వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. వాస్తవానికి 2020లో ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించినా కరోనా కారణంగా అది వాయిదాపడింది. ఈ మధ్యకాలంలో జోనాసెన్ కమిట్‌మెంట్స్ వల్ల ఆమె పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జెస్సికా జోనాసెన్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘సర్‌ప్రైజ్! థర్డ్‌టైమ్ లక్కీ.. ఎట్టకేలకు నా బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాను. ఏప్రిల్ 6.. నా హృదయంలో అలా నిలిచిపోతుంది’’ అని జెస్సికా ట్వీట్ చేసింది.
Also Read
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
Read Also: Wedding Ceremony : పెళ్లికి వచ్చి.. పెట్టింది తిన్నారు.. వచ్చిన కట్నాలతో ఉడాయించారు
జోనాసెన్ ఈ విషయాన్ని షేర్ చేయగానే ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో మ్యాచ్ ప్రెజెంటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీరోలి మీడోస్‌తో పాటు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆస్ట్రేలియన్ రచయిత్రి మేగాన్ మారిస్, కొత్తగా పెళ్లయిన జంటను అభినందిస్తూ, “ఇది అద్భుతమైన రోజులా కనిపిస్తోంది” అని రాశారు. జొనాసెన్ డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ తరఫున ఆడుతూ 9 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీయడమే గాక 73 పరుగులు కూడా చేసింది.
SURPRISE!! 3rd time lucky – finally married my best friend 🥰 April 6th will always have a special place in my heart 👩❤️👩💍 #hawaii #wedding #love pic.twitter.com/rOYEyrOGFQ
— Jessica Jonassen (@JJonassen21) April 14, 2023
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..