ఒక విచిత్రమైన సంఘటనలో 25 ఏళ్ల మగ కెన్యా చెస్ ప్లేయర్ మహిళల ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఆడటానికి మహిళల వేషధారణలో వచ్చాడు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన కెన్యా ఓపెన్ చెస్ ఛాంపియన్ షిప్‌లో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. బుర్కా ధరించి ఆయన మహిళా చెస్ టోర్నమెంట్‌లో ప్రవేశించాడు.
ఇటీవలే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఎదురుదెబ్బ తగిలింది. 2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియలు భారీ పోలీసు భద్రత మధ్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. కొంతమంది దూరపు బంధువులు, స్థానికులను శ్మశాన వాటికలోకి అనుమతించారు.
కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు.
మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. మద్యపాన నిషేదంఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కల్తీ మద్యం సేవించి 75 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే రాష్ట్రంలోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు.
ఈ రోజుల్లో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫ్రికా అమ్మాయిలను కోడలిగా తెస్తున్నారు. ఇలాంటి సమాజంలోనూ నేటికీ పరువు హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
రాత్రిపూట చెదురుమదురు ఘటనలు హింసాత్మకంగా మారగా, అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ వ్యక్తి మరణించిన తర్వాత శనివారం ఒడిశాలోని సంబల్పూర్ పట్టణంలో కర్ఫ్యూ విధించబడింది. శుక్రవారం సాయంత్రం హనుమాన్ జయంతి ఊరేగింపులు కట్టుదిట్టమైన భద్రతలో జరిగిన తరువాత హింస జరిగింది.
ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్‌లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు.
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.