Chess Player Cheating: బుర్కా ధరించి మహిళల టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు.. కానీ చివరికి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chess Player Cheating: ఒక విచిత్రమైన సంఘటనలో 25 ఏళ్ల మగ కెన్యా చెస్ ప్లేయర్ మహిళల ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఆడటానికి మహిళల వేషధారణలో వచ్చాడు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన కెన్యా ఓపెన్ చెస్ ఛాంపియన్ షిప్‌లో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. బుర్కా ధరించి ఆయన మహిళా చెస్ టోర్నమెంట్‌లో ప్రవేశించాడు. ప్రవేశించడమే కాకుండా అగ్రశ్రేణి చెస్ ఛాంపియన్‌లను కూడా ఓడించాడు. బుర్కా ధరించి ఎవరితోనూ మాట్లాడకుండా తన నిజస్వరూపాన్ని గోప్యంగా ఉంచి టోర్నీ సిబ్బందిని సైతం మోసం చేస్తూ మిల్లిసెంట్ అవుర్ పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. అతను మాజీ జాతీయ ఛాంపియన్ గ్లోరియా జుంబా, ఉగాండా అగ్రశ్రేణి చెస్ ఛాంపియన్ అంపైరా షకీరాలను ఓడించినప్పుడు ఇతర ఆటగాళ్లు, మధ్యవర్తుల మధ్య అనుమానం రేకెత్తింది. టోర్నమెంట్ సిబ్బంది, మొదట్లో జోక్యం చేసుకోవడానికి వెనుకాడారు. చివరకు నాల్గవ రౌండ్ తర్వాత అనుమానంతో దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు. అతడిని ఓ గదిలోకి తీసుకెళ్లి విచారించగా అసలు నిజం బయటపడింది. చెస్ ప్లేయర్ స్టాన్లీ ఒమొండిగా గుర్తించబడిన వ్యక్తి, బుర్కా ధరించి మిల్లిసెంట్ అవుర్ అనే పేరును ఉపయోగించి తన గుర్తింపును రహస్యంగా ఉంచాడు.
Read Also: AAP Corporators: సూరత్‌లో ఆప్‌కు షాక్.. అధికార బీజేపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఒక ప్రైవేట్ గదిలో ఆ వ్యక్తిని నువ్వు ఎవరని ప్రశ్నించగా.. తనకు నగదు అవసరం ఉందని.. అందుకే ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి, చెస్ ప్లేయర్ అయిన స్టాన్లీ ఒమొండి దీనిని అంగీకరించాడు. ఈ చెస్ ఛాంపియన్ షిప్ అతను అద్భుతంగా రాణించాడు. అంతర్జాతీయ రేటింగ్ 1500కి దగ్గరగా, బ్లిట్జ్ రేటింగ్ 1750కి దగ్గరగా ఉన్నప్పటికీ అతడు మోసానికి గానూ టోర్నమెంట్ నుంచి తొలగించబడ్డాడు. అతని పాయింట్లన్నీ అతని ప్రత్యర్థులకు అందించబడ్డాయి. ఉగాండాకు చెందిన అగ్రశ్రేణి మహిళా చెస్ క్రీడాకారిణి అంపైర్ షకీరాను ఓడించిన తర్వాత అతనిపై అనుమానం వచ్చింది. చెస్ ప్లేయర్ స్టాన్లీ ఒమొండి చివరికి టోర్నమెంట్‌లో మోసానికి పాల్పడ్డాడు. అయితే తనకు డబ్బు అవసరం కాబట్టి అలా చేశానని చెప్పాడు. కెన్యా ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్, $42,000 ఆకట్టుకునే బహుమతి నిధిని కలిగి ఉంది. ఇది 22 సమాఖ్యల నుండి దాదాపు 450 మంది ఆటగాళ్లను ఆకర్షించింది. ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 6-10, 2023 వరకు కెన్యాలోని నైరోబీలోని సరిత్ ఎక్స్‌పో సెంటర్‌లో జరిగింది.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!