Atrocious Incident: తమిళనాడులో దారుణం.. పరువు హత్యకు కొడుకు, అత్త బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious Incident in Tamilnadu: ఈ రోజుల్లో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫ్రికా అమ్మాయిలను కోడలిగా తెస్తున్నారు. ఇలాంటి సమాజంలోనూ నేటికీ పరువు హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తమకన్నా తక్కువ డబ్బు ఉన్న వారిని పెళ్లి చేసుకున్నాడని… తక్కువ కులం వారిని వివాహం చేసుకుందని.. కన్నవారిని చంపుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకొందరేమో తమ బిడ్డను ప్రేమించిన వారిని హత్య చేస్తున్నారు. తమ కుటుంబానికి సరితూగరని.. ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది ఇతర కులాల వారిని, మతాల వారిని ప్రేమించిన పాపానికి ప్రేమికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటన ఒకటి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగుచూసింది. ఈ పరువు హత్యకు కొడుకు, అత్త బలయ్యారు.
Read Also: Violence in Sambalpur: సంబల్‌పూర్‌లో చెలరేగిన హింస.. పట్టణంలో కర్ఫ్యూ విధింపు
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దండపాణి అనే వ్యక్తి కుటుంబం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో నివాసం ఉంటోంది. అతని కొడుకు సుభాష్ ఓ తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారితో మాట్లాడాలని వచ్చి కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్రగాయాలపై అక్కడికక్కడే మరణించాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది, పారిపోయిన కోడల్ని చంపడానికి వెతుకుతున్న క్రమంలో దండపాణిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!