Minister Mahamood Ali: నిర్మల్ పట్టణ శివారులో రూ.5.35 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈద్గాను ప్రారంభించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నిర్మల్‌కు చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ సోఫీనగర్‌లోని మసీద్‌ను సందర్శించారు. అనంతరం విశ్రాంతి భవనంలో హోంమంత్రి మహమూద్ అలీకి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందించారు.
ఈద్గా ప్రారంభోత్సవంలో మంత్రులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే అందమైన ఈద్గాను నిర్మల్ జిల్లాలో నిర్మించడం అభినందనీయమని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలిచారని, అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తెలంగాణలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డికి అన్ని చట్టాలు తెలుసన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో గణనీయ మార్పు సాధించిందన్న మంత్రి.. కేంద్రం అందిస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని మహముద్ అలీ పేర్కొన్నారు.
Read Also:
అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే ఈద్గా నిర్మించడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అటవీశాఖ భూమికి సమానంగా ముధోల్ నియోజకవర్గంలో అటవీ శాఖకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. చట్టం ప్రకారం గానే అన్ని పనులు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.