రాష్ట్రంలో అనుకోకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది.
తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు, దీక్షలకు పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం వంటి తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది.
ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కంటే హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది.
తెలంగాణలో గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టింది అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు.. వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లు అంటూ నేతలకు సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులు ఎట్టకేలకు తెరిచారు. కలెక్టర్ యాస్మిన్‌భాషా ఆధ్వర్యంలో జగిత్యాల వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో ఉంచిన స్ట్రాంగ్‌రూంను కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో తాళాలు పగులగొట్టి గదిని తెరిచారు. అందులోని పత్రాలు, సీసీ ఫుటేజీని పరిశీలించారు.
ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్‌ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈ కేసును సిట్ నుంచి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాటు పలువురు వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.
రాష్ట్రంలో అమిత్ షా టూర్ సక్సెస్ అయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి తరుణు చుగ్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తల్లో, రాష్ట్ర ప్రజల్లో బాగా జోష్ వచ్చిందని ఆయన అన్నారు.
యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.