ఒక నెలపాటు సుదీర్ఘమైన వేట తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మార్చి 18న రాష్ట్రం అమృతపాల్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని, అయితే రక్తపాతాన్ని నివారించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. మార్చి 18న పంజాబ్ పోలీసులు ఖలిస్తానీ వేర్పాటువాది, అతని సహాయకులపై అణిచివేత ప్రారంభించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులు సాయుధ కవచాన్ని చీల్చగల ఉక్కు బుల్లెట్లను ఉపయోగించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం భటా ధురియన్ దట్టమైన అటవీ ప్రాంతంలో సమీపంలోని గ్రామానికి ఇఫ్తార్ కోసం తినుబండారాలు తీసుకెళ్తున్న ఒంటరి ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
తూర్పు లడఖ్‌లో మూడేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనాలు ఆదివారం (నేడు) తూర్పు లడఖ్ సెక్టార్‌లోని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహిస్తున్నాయి. భారత్ వైపు నుంచి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి, వీధుల్లో, సమీపంలోని భవనాలపై గుమిగూడిన ప్రజలపై రాహుల్ గాంధీ అభివాదం చేశారు.
రెండు ప్రపంచ యుద్ధాలు ఎంత నష్టాన్ని మిగిల్చాయే అందరికి తెలిసిందే. ప్రపంచ యుద్ధాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు.చాలా మంది సైనికులు కనిపించకుండా పోయారు. కొని వార్ షిప్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లు కనిపించకుండా పోయాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఇదే జరిగింది.
స్కాట్లాండ్ తీరంలోని జనావాసాలు లేని ద్వీపం అమ్మకానికి ఉది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బార్లోకో ద్వీపం డంప్రైస్ పట్టణానికి దాదాపు ఆరు మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంలో చెరువుతో పాటు గులకరాయి బీచ్ కూడా ఉంది.
సాధారణ జీవనం గడిపే స్వీపర్ 16 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవచ్చా.. ఇది వినడానికి తమాషాగా ఉన్నా.. వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ స్వీపర్‌కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు స్వీపర్ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది.
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకాలు తెచ్చిన రెజ్లర్లు.. లైంగిక వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమపై జరుగుతోన్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్లు గళం వినిపిస్తున్నారు. వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శనకు దిగారు.
నెల రోజుల పాటు వెంబడించిన తర్వాత పంజాబ్‌లోని మోగాలో ఆదివారం ఉదయం అరెస్టయిన ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అతని భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై నిఘా పెట్టినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేదార్‌నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.