Crime News: పెళ్లైన మహిళకు మెసేజ్‌లు పంపిస్తున్నాడని.. పట్టపగలే గొంతుకోసి, ఆపై బండరాయితో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన ముష్కి మహేష్ అదే గ్రామానికి చెందిన నలుగురు నడిరోడ్డుపై బండరాయితో కిరాతకంగా కొట్టి చంపేశారు. ముష్కి మహేష్(28) అనే వ్యక్తి బైక్‌లో పెట్రోల్ పోయించుకున్న వస్తున్న క్రమంలో అడ్డగించిన ఆ నలుగురు దాడికి దిగారు. గొంతు కోసి ఆపై బండ రాయితో తల పగలకొట్టారు. ఆ సమయంలో స్థానికులెవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Theft: పెండ్లి బృందానికి బాలుడి ఝలక్.. లక్ష ఎలా కొట్టేశాడో చూడండి..
Also Read
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, మహేష్‌కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మహేష్ ఫోన్ ద్వారా అసభ్య మెసేజ్‌లతో వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో మాటువేసి ఈ ఉదయం మహేష్‌ను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు మహేష్‌ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఇంకోవైపు మహేష్ వేధింపులపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడం వల్ల అమ్మాయి కుటుంబసభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. తన కొడుకును అన్యాయంగా చంపేసిన వారిని అప్పగిస్తే తగిన శిక్ష విధిస్తామని బాధిత తల్లి రోధిస్తోంది. పోలీసుల విచారణలో వాస్తవాలు తెలియాల్సి వుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!