Psycho Hulchul: అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి ఓ సైకో వీరంగం సృష్టించాడు. గైనిక్ వార్డులోకి ప్రవేశించిన సైకో.. రాళ్లతో కిటికీలు ధ్వంసం చేశాడు. సైకో వీరంగంతో బాలింతలు, మహిళలు అరుపులతో పరుగులు తీశారు. పరిగెత్తుకుంటూ వెళ్లి సెక్యూరిటీకి సమాచారమందించారు.
ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది సైకోని పట్టుకుని తాళ్లతో కట్టేశారు. ఆ వ్యక్తి ఒడిశాకు చెందిన వాడిగా గుర్తించారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు వైద్యం నిమిత్తం హాస్పిటల్స్ సూపరిండెంట్ శ్రావణ్ కుమార్ పంపించారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు.