*నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.. మొత్తం 224 స్థానాలకు పోలింగ్.. 13న వెలువడనున్న ఫలితాలు
*హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలు.. ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
*నేడు తెలంగాణలో ఎంసెట్ పరీక్ష
*నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించనున్న పవన్.. అవిడి, కడియం, రాజుపాలెం గ్రామ రైతులతో ముఖాముఖి.
*నేడు ఏపీలో పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష
*తిరుపతి: చాటింపుతో మొదలైన తిరుపతి గంగమ్మ జాతర.. నేటి నుంచి వేషాల పండుగ ప్రారంభం
*IPL 2023: నేడు చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్