Perni Nani: తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. తానొక్కడినే తెలివైన వాడిని అనుకుంటాడని ఆయన పేర్కొన్నారు. జగన్‌ను తిట్టడం కోసమే పవన్ రోడ్డు మీదకు వస్తుంటాడని ధ్వజమెత్తారు. 6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో కూడా పవన్ విమర్శించేవాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ డైలాగులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఎవరో టీ కొట్టు అతను వ్యాన్ ఇస్తే పవన్ వారాహి అని పేరు పెట్టాడని.. ఇప్పుడు ఆ వారాహి ఎక్కడికి పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
“పట్టుమని పది రోజులైనా రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పని చేశాడా??. వీకెండ్‌లో రావటం, జగన్ ను, జనాలను తిట్టడం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోవటం.రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా రోబో సినిమాలో రజనీకాంతా?? కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబంపై చంద్రబాబు దాష్టికం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదు??. కాపులను రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు మోసం చేస్తే ఎందుకు అడగలేదు. 50 శాతం పైబడి రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదని జగన్ నిజాయితీగా చెప్పారు. ఎన్నికలకు ముందు ఇలా చెప్పగలిగే దమ్ము ఉన్న నాయకుడు జగన్. కాపులను దగా చేసింది చేసింది చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాదా?.” అని పేర్ని నాని మాట్లాడారు.
Read Also: Andhrapradesh: చంద్రబాబుకు భారీ షాక్.. గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసిన ప్రభుత్వం
భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్నాడన్న పేర్ని నాని.. సినిమా బాగుంటేనే జనం చూస్తారన్నారు. లేదంటే చూడరన్నారు. రూ.100 కోట్లు దాటిన పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా ఉందా? రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పడు రూ.30కోట్ల నష్టం ఎలా వస్తుందని ప్రశ్నించారు. డబ్బింగ్, కాపీ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారని ఆయన ప్రశ్నించారు. వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేస్తే జనాలు చూస్తారని.. చిరంజీవి వల్ల సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు కూడా ఎత్తటం లేదన్నారు. రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కల్యాణ్ కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కుల ప్రస్తావన లేకుండా ఒక్కరోజైనా మాట్లాడారా?.. చంద్రబాబును తిడితే మాత్రమే పవన్‌కు మానవత్వం పొంగిపొర్లుతుందా? అంటూ పేర్ని నాని మాట్లాడారు.