ఫ్రాన్స్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించిన అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన మంగళవారం నాటి రాత్రి పారిస్ శివారు ప్రాంతాల్లోనే చోటుచేసుకున్న ఈ అల్లర్లు గురువారం దేశమంతా పాకాయి.
తమిళనాడులో రాజ్ భవన్‌లో అర్ధరాత్రి వరకు పొలిటికల్ హైడ్రామా సాగింది. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్‌ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని తెలుస్తోంది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
మెక్సికో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ (122 ఫారెన్‌హీట్)కి చేరుకోవడంతో వేడి సంబంధిత కారణాల వల్ల మెక్సికోలో గత రెండు వారాల్లో కనీసం 100 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో పరిస్థితికి రాహుల్ గాంధీ ప్రస్తుత విభేదాలను పెంచడం కంటే కరుణ అవసరమని అన్నారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన 2019 ప్రయోగం విఫలమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం అన్నారు.
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లకు కారణంగా మారింది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.
వందే భారత్ రైలు ప్రయాణీకులకు సౌకర్యాన్ని కల్పిస్తోంది. సమయాన్ని ఆదా చేస్తోంది. దీంతో ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదలైంది. కాసర్‌గోడ్-త్రివేండ్రం వందే భారత్ రైలు ప్రయాణికుల ఆదరణలో అగ్రస్థానాన నిలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఆయన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని అన్నారు.
హింసతో రగిలిపోతున్న మణిపూర్‌లో రెండురోజులపాటు పర్యటించేందుకు రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం అక్కడికి చేరుకున్న రాహుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది.