అస్సాంలో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాకుండా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని రోజువారీ వరద నివేదిక ధృవీకరించింది.
ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బుధవారం నియమించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో త్వరలో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు జరిగిన సమీక్షా సమావేశంలో సింగ్ డియో నియామకాన్ని ప్రకటించారు.
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ భట్నాగర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో స్పెషల్ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఎలా పుట్టిందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మనుషులకు ఎందుకు సోకింది అనే మూడేళ్లుగా సమాధానం లేని ప్రశ్నపై.. చైనాలో వుహాన్ నగరంలోని... వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు... ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు.
దేశంలో నిత్యం ఏదో మూలన ఆడవాళ్లపై అత్యాచారాలు, హింస కొనసాగుతూనే ఉంది. రోడ్లు, బస్సులతో పాటు ఇప్పుడు ఆసుపత్రుల్లో కూడా మహిళలకు భద్రత లేదు. కన్నూర్ జిల్లాలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై ఓ నర్సింగ్ అసిస్టెంట్ వేధింపులకు పాల్పడ్డాడు.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కాంగ్రెస్ నేత కె.రమేష్ బాబు ఫిర్యాదు మేరకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతపై ఫిర్యాదు నమోదైంది.
మెక్సికోలోని సాయుధ బృందం మంగళవారం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో భద్రతా దళాలు అపహరణకు గురైన 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి.