తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవు.. సర్దుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
అమర్‌నాథ్ యాత్రలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక వ్యయప్రయాసలకు గురవుతారు. ఇక్కడి సహజ గుహలు, ప్రకృతి రమణీయత మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక వాతవరణం గురించి మాటల్లో చెప్పలేం. అమర్‌నాథ్ యాత్రలో దీనితోపాటు చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
భారతదేశం ఆహారం, ప్రత్యేక రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక రకాల వంటకాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇది అందరికీ నచ్చే వంటకం. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో పంచుకునే భావోద్వేగం.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఆలయంలోనే దొంగతనం చేసేందుకు దుండగులు తెగబడ్డారు. ఆరుళ్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల కారణంగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ఈ రోజు గవర్నర్‌ను కలవనున్నారు. బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
శివసేన (యూబీటీ)కి చెందిన సామ్నా తన తాజా సంపాదకీయంలో రుతుపవనాల సన్నద్ధత, ముంబయిలో వరదల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది. అవినీతి కారణంగా నగరం మునిగిపోయిందని పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు అతిషికి ఢిల్లీ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, ఆదాయానికి సంబంధించిన అదనపు బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు విభాగాలు గతంలో కైలాష్ గెహ్లాట్ వద్ద ఉండేవి.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.