ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ సర్కారు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం 146 కొత్త అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమి సమస్యను అనుభవిస్తున్నారు. అయితే ఇతరులకు దూరం అవుతామనే భయం, బిడియం, అపోహల కారణంగా చాలా మంది సంతాన సాఫల్య చికిత్సల సహాయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నామన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపే ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను తెలుసుకున్నామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని భట్టి పేర్కొన్నారు.
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్‌తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా... పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.