చాలా మంది తమ పేరుతో ఒక సొంత ఇల్లు ఉండాలని, ఓ ఇంటి స్థలం కొనుక్కోవాలని, మంచి ఏరియాలో ప్లాట్‌ను కొనుగోలు చేయాలని కోరుకుంటారు. జీవితంలో ఒక ఇల్లు కొనడం, లేదా కట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ కోరికను తీర్చుకోవడానికి పొదుపు చేస్తుంటారు.
దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు తనపై మోపిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం 2023-2024 ప్రభుత్వ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, మొత్తం 18 శ్లాబ్‌లపై ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
ప్రధానమంత్రిపై దుర్భాషలాడడం అవమానకరమైనదని,బాధ్యతారాహిత్యమైనదని.. అయితే అది దేశద్రోహం కాదని, పాఠశాల యాజమాన్యంపై దేశద్రోహ కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
తోటి వ్యాపారులపైనే దాష్టీకానికి పాల్పడ్డారు. బకాయిలు అడిగినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. విచక్షణ మరిచి.. బట్టలు ఊడదీసి కొట్టారు. ఆపై వీడియోలు రికార్డు చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో చేసిన ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.