Karnataka Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య.. ఎక్సైజ్ సుంకం భారీగా పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Budget 2023: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం 2023-2024 ప్రభుత్వ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, మొత్తం 18 శ్లాబ్‌లపై ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 175 శాతం నుంచి 185 శాతానికి పెంచనున్నారు. కర్ణాటక బడ్జెట్ మొత్తం రూ. 3,27,747 కోట్లుగా అంచనా వేస్తూ ప్రకటించారు.
ఐదు హామీల పథకాలతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన 5 హామీలకు రూ.52 వేల కోట్లు కేటాయింపు ఉంటుందని, కోటి కంటే ఎక్కువ కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని, ఇది దేశంలోనే మొదటిసారిగా అమలు చేయబడుతుందని సిద్దరామయ్య ప్రసంగించారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని సిద్ధరామయ్య పేర్కొ్న్నారు. “మా ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మోరల్ పోలీసింగ్ పేరుతో ప్రజలను వేధించే వారిపై, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేసి సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.
Also Read
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
Also Read: Karnataka High Court: ప్రధానిపై దుర్భాషలాడడం అవమానకరం, కానీ దేశద్రోహం కాదు
మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 2,50,933 కోట్లు, మూలధన వ్యయం రూ. 54,374 కోట్లు, రుణాల చెల్లింపు రూ. 22,441 కోట్లు కేటాయించారు. విద్యకు రూ.37,587 కోట్లు, స్త్రీ, శిశు అభివృద్ధికి రూ. 24,166 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపులో వరుసగా 11%, 7 శాతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 14,950 కోట్లు కేటాయించారు. గత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలను ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య విమర్శించారు. సీఎంగా సిద్ధరామయ్యకు ఇది ఏడవ బడ్జెట్. ఈ బడ్జెట్ సిద్ధరామయ్య హాజరయ్యే 14వ బడ్జెట్ కూడా అవుతుంది. 13 బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన మాజీ సీఎం దివంగత రామకృష్ణ హెగ్డే మార్కును ఆయన అధిగమించారు.
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!