పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మొగల్తూరు మండలం మొళ్లపర్రు గ్రామంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మత్స్యకారులు మృత్యువాత పడిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది.
గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల్లోనే 8మంది దాకా ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. మరో 28మంది దాకా గాయపడ్డారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాతీయ పార్టీలో చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలో ఉండవచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూలై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మరుసటి రోజు తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించి దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు చేయనున్నారు.