మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తిపై మూత్ర విసర్జన చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత.. రాష్ట్రంలోని సెహోర్ జిల్లాలో ఒక మహిళ తన భర్తపై ఆరోపణలు చేసిన మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌లో భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మంగళవారం పారామిలటరీ ఫోర్స్ వాహనం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు గాయపడ్డారని తెలిసింది.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన కొంతమంది పురుషులు నగ్నంగా నిరసన తెలిపారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
బెంగళూరు వేదికగా విపక్షా కూటమి రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు.
ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల అక్రమ వివాహంపై కేసును కోర్టులో విచారణకు అర్హమైనదిగా పేర్కొంది. జూలై 20న వారిద్దరు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌ను తమ దేశానికి తిరిగి పంపకపోతే 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందని గత వారం హెచ్చరించిన కాల్‌కు సంబంధించి ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి ఈరోజు తెలిపారు.
రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తాజాగా వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. ఈ నెల 20న పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో నిందితుడు వెంకటనాయుడు ఇంటిపై మృతుడి బంధువులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.