TS Singhdeo: కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేలే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Singhdeo: ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని, పార్టీ గెలిస్తే, సీఎం పదవికి పరిగణించబడే వరుసలో బఘేల్ మొదటి స్థానంలో ఉంటారని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ఆదివారం అన్నారు. ఓ ఇంటర్వ్యూలో టీఎస్ సింగ్ డియో మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రిని తొలగించకపోతే ఆ వ్యక్తి జట్టును విజయపథంలో నడిపించగలడని, గెలిచిన తర్వాత కెప్టెన్‌ను ఎందుకు మార్చాలనే నమ్మకాన్ని పార్టీ కలిగి ఉందన్నారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మరో అద్భుతమైన అవకాశం ఉందని, కొందరు తమ పార్టీకి 75 ప్లస్ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారని, అయితే తన అంచనా 60 నుంచి 75 ప్లస్ మధ్య ఉంటుందని అంచనా వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుంది.
Also Read: Cab Driver: క్యాబ్ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య గతంలో ఉద్రిక్తతలు లేవా అని అడిగిన ప్రశ్నకు.. మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, కలిసి పని చేస్తున్నామని టీఎస్ సింగ్ డియో చెప్పుకొచ్చారు. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే సరిపోయేదన్నారు. రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండనందుకు ద్రోహం చేశారా అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘దీనిని ద్రోహంగా చూడను.. హైకమాండ్ తీసుకునే నిర్ణయంగా చూస్తా.. సీఎం కాలేను.. ఫీడ్‌బ్యాక్ మేరకే హైకమాండ్ మా అందరికీ హోదా కల్పిస్తోంది.” అని ఆయన చెప్పారు. హైకమాండ్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. తనను డిప్యూటీ సీఎంగా చేయడం మునుపటి స్థానం నుంచి దిగజారిపోయారా లేదా పురోగతినా అని అడిగిన ప్రశ్నకు.. ప్రోటోకాల్ ప్రకారం, తాను ఇప్పటికే క్యాబినెట్‌లో రెండవ స్థానంలో ఉన్నానని సింగ్ డియో చెప్పారు.
Also Read: Gujarat: గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సునీతా అగర్వాల్ ప్రమాణ స్వీకారం
ఇప్పుడు రెండున్నరేళ్లు లేవని, ఎన్నికలకు కేవలం నాలుగైదు నెలలు మాత్రమే సమయం ఉందని, గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని పేర్కొన్నారు. రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటానని వాగ్దానం చేశారా అనే విషయంపై సింగ్ డియో మాట్లాడుతూ, చాలా చర్చలు మూసిన తలుపుల వెనుక జరుగుతున్నాయని అన్నారు. “ఈ రెండున్నరేళ్ల (పదవీకాలం) గురించి హైకమాండ్ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు, కాబట్టి నేను ఎటువంటి వ్యాఖ్యానించలేని స్థితిలో ఉన్నాను. మూసిన తలుపుల వెనుక జరిగే చర్చల గౌరవాన్ని ఒకరు కాపాడుకోవాలి” అని సింగ్ డియో అన్నారు.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!