Woman Urinates On Plane’s Floor: గత కొన్ని నెలలుగా విమానాల్లో వికృత ప్రవర్తన సర్వసాధారణంగా మారింది. ఒక ప్రయాణికుడు మరొక ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడం, విమానయాన సంస్థలు ప్రయాణికులను విమానాశ్రయంలో వదిలివేయడం నుంచి విమానంలో ఒక మహిళను తేలు కుట్టడం వరకు ఇటీవల విమానయాన పరిశ్రమలో కొన్ని అసాధారణ సంఘటనలు జరిగాయి. మరో విచిత్రమైన సందర్భంలో వ్యూ ఫ్రమ్ ది వింగ్‌లోని ఒక నివేదిక ప్రకారం, విమానంలోని రెస్ట్‌రూమ్‌ని చాలా గంటలపాటు ఉపయోగించేందుకు ఎయిర్‌లైన్ సిబ్బంది నిరాకరించారని ఆరోపిస్తూ విమానం మధ్యలో తాను మూత్ర విసర్జన చేయవలసి వచ్చిందని ఒక మహిళ చెప్పింది.
Also Read: Goods Train Derailed: తప్పిన పెనుప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాను రెండు గంటల పాటు మూత్ర విసర్జన చేయకుండా వేచి ఉన్నానని.. ఇక్క తట్టుకోలేక విమానం ఫ్లోర్‌లోనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందని మహిళ పేర్కొంది. ఆమె విమానం నేలపై మూత్ర విసర్జన చేయగా.. దానికి సంబంధించిన వీడియోను క్యాబిన్ సిబ్బంది సభ్యుడు రికార్డ్ చేశారు. ఈ విషయంపై స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించలేదు. అయితే విమానంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2018లో కూడా ఓ మహిళ విమానం నేలపై వంగిపోయి మూత్ర విసర్జన చేసింది.