Attack on MLA: మద్యం మత్తులో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on MLA: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి జరిగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఖిలేశ్వర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఖుజ్జి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Read Also: Adani Group: అదానీ గ్రూప్‌నకు ముగిసిన హిండెన్‌బర్గ్ శాపం.. మూడు నెలల్లో 70శాతం లాభం
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ప్రాథమిక సమాచారం ప్రకారం సాహు వేదికపై ఉండగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సాహు మణికట్టుకు స్వల్ప గాయాలు కావడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చురియాకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనను ఖండిస్తూ ఛత్తీస్‌గఢ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే భద్రత లేనప్పుడు సామాన్యుల భద్రత మాటేమిటని ప్రశ్నించారు. ఇది భూపేశ్ బఘేల్ ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!