Chandrayaan-3: ఉద్విగ్న క్షణాల్లో భారతావని.. షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమైంది. జాబిల్లిపైకి మన వ్యోమనౌక చంద్రయాన్-3 అద్భుతమైన క్షణాల కోసం యావత్ భారతావని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నెట్టింట ఆ ఉత్కంఠ కనిపిస్తోంది. చంద్రుడిపై ల్యాండర్ సురక్షితంగా దిగి, చరిత్ర సృష్టించాలని ప్రతీ ఒక భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో ల్యాండర్ సురక్షితంగా దిగాలని ఆలయాల్లో హోమాలు, దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేస్తుకున్న వ్యోమనౌక దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తోంది. ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 వ్యోమనౌక షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. ఈ సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది.
Read Also: Chandrayaan-3 Mission: అంతా సిద్దం.. చంద్రయాన్ 3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
” ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్(ఏఎల్‌ఎస్)ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపింది. “సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశానికి రానుంది. ఏఎల్‌ఎస్ కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ థ్రాటల్‌బుల్ ఇంజిన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్తుంది’’ అని ఇస్రో రాసుకొచ్చింది. ల్యాండింగ్ ప్రక్రియను సాయంత్రం 5.20 గంటల నుంచే ఇస్రో తమ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సాయంత్రం 5.44 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత 17 నిమిషాల పాటు సాగే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండనుంది. అందుకే దీన్ని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యోమనౌక జోరుకు ఈ 17 నిమిషాల్లోనే కళ్లెం వేసి, చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దించాలి. దీన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. ల్యాండింగ్ పూర్తయిన తర్వాత వెంటనే వ్యోమనౌక కాళ్లలోని ‘టచ్‌డౌన్ సెన్సర్లు’.. ఆన్‌బోర్డ్ కంప్యూటర్‌కు మెసేజ్‌ను పంపుతాయి.
విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాలని దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు జరుగుతున్నాయి. యోగా గురువు రామ్‌దేవ్ బాబా హరిద్వార్‌లో హోమం చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రార్థనలు జరిగాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని పాటలు పాడారు. అలాగే ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ సైకత శిల్పి సదర్శన్ పట్నాయక్ తన కళతో చంద్రయాన్-3 విజయాన్ని కాంక్షించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయం సాధించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ల్యాండర్ ల్యాండింగ్ అయిన తర్వాత రోవర్ బయటకు వస్తుంది. ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగించనున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!