జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి.
చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్‌తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
చంద్రుడిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రధాని మోడీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భారతదేశం చేసిన అద్భుతమైన ఫీట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అభినందించారు.
అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రయాన్-3 విజయంతో తన జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండమ్ విజయవంతంగా ల్యాండ్ అయింది. శాస్త్రవేత్తలు ఊహించని మేరకే ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు తెలిసింది.
15వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాల అధినేతలను గ్రూప్ ఫోటోకు పోజులివ్వడానికి పిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, రోల్స్ రాయిస్ కారు ఢీకొన్న ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న ఇద్దరు మరణించగా.. లగ్జరీ కారులోని ప్రయాణికులు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.