టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు లిస్ట్ అయింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. ఇప్పటికే నారా ఫ్యామిలీ చంద్రబాబును కలిసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఆర్‌డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.