దేశంలో ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించే ముందు కొన్ని భద్రత చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. అందులో వీధి కుక్కల్ని బంధిచడం కూడా ఒకటి. ఎందుకంటే వీధి కుక్కలు కొత్తవారిని చూసినప్పుడు లేదా ఆ ప్రాంతంలో ఏదైనా కోలాహలం జరిగినప్పుడు భయంతో మనుషుల్ని గాయపరిచిన సంఘటనలు కోకొల్లలు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఢిల్లీ ప్రభుత్వం భవన కార్మికుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ వ్యాన్‌లను ఉపయోగించి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలోని లేబర్ సైట్ లలో పనిచేస్తున్న భవన కార్మికుల పేర్లను నమోదు చేస్తున్నారు. దీనిద్వారా వీలైనంత ఎక్కువమంది కార్మికుల్ని గుర్తించే అవకాశం వుంది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది.
అత్యాశ అన్ని అనర్ధాలకి మూలం అని తెలిసి కూడా మనిషి కొన్నిసార్లు తన ఆలోచన శక్తిని కోల్పోతుంటాడు. ఎక్కడైనా ఒక రూపాయి లాభం వస్తుంది అంటే చాలు.. ఆ విషయం చెప్పింది తెలిసిన వాళ్ళ లేదా తెలియని వాళ్ళ అని ఆలోచించరు. రెండు మాటలు మంచిగా మాట్లాడితే చాలు అపరిచితులని అమాయకంగా నమ్ముతారు. ఆ నమ్మించినవాడు చివరికి నట్టేట ముంచిపోతాడు.
అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు, ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాయిదా కోరటంతో న్యాయస్థానం వాయిదా వేసింది.
తిరుమల మాడవీధులలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇక నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కలవబోతున్నారు.